శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం సారవకోట మండలంలో 82 శాతం పూర్తయింది. మండల పార్టీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అనారోగ్యంతో ఉన్నప్పటికీ పార్టీ అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించారని పార్టీ శ్రేణులు ప్రశంసించాయి. రోజుకు 10 గంటలకు పైగా మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిశారని తెలిపారు.
కార్యక్రమాన్ని కేవలం పార్టీ ప్రచారానికి పరిమితం చేయకుండా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాలను కత్తిరి వెంకటరమణ స్వయంగా పరిశీలించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని వాటిని “మై టీడీపీ” యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.
మండలంలోని ఇంటింటి కార్యక్రమాన్ని 82 శాతం పూర్తి చేసి సారవకోటను ఆదర్శంగా నిలిపారని పార్టీ శ్రేణులు అభినందించాయి. ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని కత్తిరి వెంకటరమణ నిరూపించారని పేర్కొన్నాయి.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బగ్గు అర్చన మార్గదర్శకత్వంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సారవకోట మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో కత్తిరి వెంకటరమణ కీలకంగా పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పదవి కోసం పనిచేసే నాయకులు చాలామంది ఉన్నప్పటికీ, పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేసే నాయకులు అరుదుగా ఉంటారని శ్రేణులు అన్నారు. పదవి కంటే పని, వ్యక్తిగత ప్రయోజనం కంటే పార్టీ విజయం ముఖ్యమనే నిబద్ధతకు కత్తిరి వెంకటరమణ నిదర్శనమని ప్రశంసించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news