రాజమహేంద్రవరం: గోదావరి నదిలోకి మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2 కోట్లతో 600 ఎంఎండీఐ పైపులైన్ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగరంలోని 34వ డివిజన్లో వాసవి శ్రీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని నల్లా ఛానెల్ పంప్‌హౌస్ నుంచి పుష్కర ఘాట్ వరకు సుమారు 5 అడుగుల లోతులో పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ పైపులైన్‌ను గోదావరి గట్టు వెంట ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేసి, త్రీటౌన్, జిల్లా కోర్టు, పుష్కర ఘాట్ మీదుగా హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ప్రధాన అండర్‌గ్రౌండ్ డ్రైన్‌కు మురుగునీటిని తరలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత డ్రైనేజీ వ్యవస్థను గుర్తించి, దాని అమరికను పరిశీలించడంతో పాటు పూడిక తొలగింపు పనుల కోసం మూడు నెలలుగా కృషి చేశామని ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.79 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిపాలనా అనుమతి త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు.
క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డును మరో ఏడెనిమిది నెలల్లో తొలగించి, నగర వ్యర్థాలను పెద్దాపురంలో నిర్మిస్తున్న వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కేంద్రానికి తరలించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. నగరానికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుండటం ప్రజాప్రతినిధిగా తనకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
కొత్త పింఛన్లపై కూడా ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ సచివాలయంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, ఈ నెలాఖరులోగా అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news