విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలో నూతన ఎస్వీఎస్ హబ్‌ను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన వ్యాపార సంస్థ ప్రారంభం కావడం ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యాపారాలు, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, ప్రభుత్వం వారికి అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పారు.
తమ జీవనోపాధి కోసం వ్యాపార రంగంలో అడుగుపెడుతున్న ప్రతి కార్యకర్తను, యువకుడిని ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక స్థాయిలో వ్యాపారాలు అభివృద్ధి చెందడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జి పైడి శ్రీను, అధ్యక్షుడు జలకం రాజారావు, క్లస్టర్ ఇంచార్జి కంచి ధనశేఖర్, ఎల్.ఏ. గోపిరెడ్డి, కె. రామరాజు, మరియా, ధర్మాన రాము తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి కల్పించాలని వారు ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news