స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పట్టణంలోని 12వ వార్డు మారెమ్మకొండ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, వంటగది, బాత్రూమ్లు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం అంగన్వాడీ సిబ్బందితో కలిసి చిన్నారులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే, విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, “స్వచ్ఛాంధ్ర – ఆరోగ్యాంధ్ర – ఐశ్వర్య ఆంధ్ర” లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు.
అదే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ అండ్ ఎండీ శ్రీమతి నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సేవా రంగాల్లో ఆమె అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. పేదలు, అనాథలు, మహిళలకు అండగా నిలుస్తూ సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news