నంద్యాల జిల్లా డోన్ సమీపంలో ప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. అనంతపురం నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సులో ఈ చోరీ జరిగినట్లు సమాచారం. మోతిలాల్ అనే వ్యాపారి భారీ మొత్తంలో బంగారాన్ని వెంట తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రయాణ సమయంలో తన వద్ద ఉన్న బంగారం కనిపించకపోవడంతో బాధితుడు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సులో ప్రయాణించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. బస్సులోని సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, బంగారం విలువ కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news