కేంద్ర ప్రభుత్వం రైతులు, యువత సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికీ ఆగవని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటికే 12 లక్షల మందికి పైగా ఉద్యోగాలను అందించినట్లు తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నిలిచిపోలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమవుతోందని తెలిపారు. రైతుల పంటలకు మార్కెట్ భరోసా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, పంట కొనుగోళ్లలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
వ్యవసాయ రంగానికి అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులపై భారీ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.12 వేల కోట్లకు పైగా సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బండి సంజయ్ పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news