కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న సర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్ పరిశీలించారు. బూత్ నంబర్లు 13, 14 పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు, మ్యాపింగ్ పురోగతి, నమోదవుతున్న వివరాలను సమీక్షించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆయన సూచించారు.
సర్-2025 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఇంటిని సందర్శించి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, సమాచారాన్ని పూర్తిగా ధృవీకరించి ఎలాంటి పొరపాట్లు లేకుండా పనులను పూర్తి చేయాలని అడివప్ప గౌడ్ పేర్కొన్నారు. ఓటరు జాబితా సమగ్రతను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే ద్వారా మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను గుర్తిస్తారని తెలిపారు. అలాగే అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఓటర్లు కూడా తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.
ఎన్యుమరేషన్ ఫారం పొందిన ఓటర్లు గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు అవసరమైన పత్రాలను బీఎల్వోలకు అందించి కార్యక్రమానికి సహకరించాలని కోరారు. నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో సర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు, బూత్ లెవెల్ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news