మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం కుంటానహాల్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టోర్నమెంట్లో విజేతగా నిలిచిన బదినేహళ్ జట్టుకు నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి రూ.30,000 నగదు బహుమతిని అందజేశారు.
రన్నరప్‌గా నిలిచిన కుంటానహాల్ జట్టుకు ద్వితీయ బహుమతితో పాటు ట్రోఫీలను కౌతాళం టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు, చైర్మన్ టిప్పు సుల్తాన్ అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నాయకులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతను ఆరోగ్యవంతమైన జీవనశైలివైపు నడిపించవచ్చని తెలిపారు. యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మారెప్ప, డైరెక్టర్ నరసింహులు, మాణిక్ భాష, కౌతాళం గిరి, జనసేన నాయకుడు హాజీ, బీజేపీ నాయకుడు నాగరాజు, ఆలంభాష, రోషన్, డీలర్ ఈనాయత్, ఐటీడీపీ షబ్బీర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధికి కూటమి నాయకులు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news