తెలంగాణలో సిఎన్జి వాహనదారులకు ధరల పెరుగుదలతో షాక్ తగిలింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా దిగుమతులకు ఆటంకం ఏర్పడి, సరఫరా తగ్గడంతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు ఇటీవల కిలోపై అదనంగా రూ.31 వరకు వసూలు చేయగా, తరువాత మరో రూ.2 పెంచినట్లు సమాచారం.
వారం క్రితం వరకు సిఎన్జి ధర కిలోకు సుమారు రూ.96 ఉండగా, శనివారం నుంచి అన్ని బంకుల్లో కిలోకు రూ.299 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సరఫరా తగ్గుదల, అంతర్జాతీయ పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news