తెలంగాణ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోడియం వద్ద నిరసన చేపట్టిన కారణంగా BRS సభ్యులను ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. నిరసనకారులను గౌరవప్రదంగా బయటకు పంపాలని చీఫ్ మార్షల్‌కు ఆదేశాలు ఇచ్చారు.
BRS ఎమ్మెల్సీలు పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్పై చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో వారు పోడియం వద్దకు చేరుకుని పత్రాలను చింపి విసిరినట్లు సమాచారం. పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారు వినకపోవడంతో ఛైర్మన్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనతో శాసనమండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news