విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, వైద్య చికిత్సల కోసం సహాయం అవసరమైన కుటుంబాలకు ఈ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడలో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గత 20 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో ఆయన పాత్ర అభినందనీయమన్నారు.
ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సుమారు రూ.8 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు వైద్య సహాయం అందిస్తూ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తోందన్నారు.
ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ చేరేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, భవిష్యత్తులో కూడా పేదల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నేతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news