తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి నియోజకవర్గం పల్లి వీధిలో వేషాలమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ జగదీష్ ఆధ్వర్యంలో జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జాతర పోస్టర్ను ఆవిష్కరించి ఆలయ ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఆలయ జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. భక్తి భావనతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించే శక్తి ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలకు ఉంటుందని ఆమె అన్నారు. జాతరలు ప్రజల్లో ఆనందం, ఐకమత్యాన్ని పెంచే ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలుగా నిలుస్తాయని తెలిపారు. జాతర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నార్ సుగుణమ్మ, రాష్ట్ర నాయకులు చందన స్రవంతి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, దంపూరి భాస్కర్ యాదవ్, బిజీ కృష్ణ యాదవ్, పుష్పవతి, కోడూరు బాలసుబ్రమణ్యం, మన్యం శ్రీనివాసులు, రాజారం, విశ్వనాధం, ఆలయ కమిటీ సభ్యులు మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై జాతర కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.
Fetching videos...
Fetching latest news...
No trending news