ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)పై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమగ్రంగా చర్చించారు. కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు, బూత్ స్థాయి నిర్వహణ వంటి అంశాలపై పార్టీ నేతలకు మార్గదర్శకాలు అందించారు.
పార్టీ శ్రేణులు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు పాల్గొని కార్యాచరణపై దిశానిర్దేశం స్వీకరించారు.
కర్నూలు జిల్లాలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని గుడిసె ఆది కృష్ణమ్మ గారు పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news