టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్ (SIR) అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ వర్క్‌షాప్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఎంపీ పార్థసారథి సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు వంటి అంశాలపై ఈ వర్క్‌షాప్‌లో చర్చించినట్లు సమాచారం. పార్టీ స్థాయిలో సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news