నెల్లూరు జిల్లా తాటిచెట్లపాలెంలో జరిగిన పడవలు బోల్తాపడిన ఘటనపై మంత్రి నారాయణ వివరాలు తెలుసుకున్నారు. ఘటన స్థితిగతులపై కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మరియు సంబంధిత అధికారులతో మంత్రి నేరుగా మాట్లాడి సమాచారం తీసుకున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ విషాద ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Fetching videos...
Fetching latest news...
No trending news