పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ ఆస్తి అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత ఫోటోలతో ముద్రించిన పాసుపుస్తకాల వల్ల అనేక సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించిన పాసుపుస్తకాల కారణంగా భూ రికార్డుల విషయంలో గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందజేస్తూ భూ యజమానులకు న్యాయ పరిరక్షణ కల్పిస్తోందని తెలిపారు.
రాజముద్రతో ఉన్న పాసుపుస్తకాలు ప్రభుత్వ అధికారిక ధృవీకరణకు ప్రతీకగా నిలుస్తాయని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా చేస్తాయని ఎమ్మెల్యే తాతయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు ఎమ్మార్వో శాంతి లక్ష్మీ, పోలంపల్లి మునీరు ప్రాజెక్టు చైర్మన్ పొన్నం బాలాజీ, నాయకులు పొందూరి నాగేశ్వరరావు, యార్లగడ్డ విశ్వనాథం, కంచేటి రాంబాబు, రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news