శ్రీకాకుళం నగరంలోని NGOS సంఘ భవనంలో ఆదివారం ఉదయం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవుల నరసింహారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ ఉద్యోగులపై ఎలాంటి రాజకీయ వేధింపులు జరిగినా వాటిపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీసీ ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులు, ఉద్యోగ భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. బీసీలకు రాజ్యాధికారం సాధించాలనే అంశాన్ని కూడా పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. మూడు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, APNGOs జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాల రావు, కిల్లాన మాధవరావు, బొట్టా మధు, EV సత్యనారాయణ, మీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణారావు, కైతి వెంకటరమణ, రౌతు శంకర్ రావు, ప్రొఫెసర్ PSR నాయుడు, నక్క కృష్ణారావు, కుశ వెంకటరమణ, కిల్లాన ఫాల్గుణరావు, డాక్టర్ సిందూర సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news