2024లో పోలీసులు అతని సంస్థపై దాడి చేసినప్పుడు వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయి. కోల్డ్ స్టోరేజ్‌లో అనేక మృతదేహాలు కప్పకుండా, కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. కొన్ని మృతదేహాలు నెలల తరబడి అక్కడే ఉండిపోయాయని, ఒక శిశువు మృతదేహం కూడా చాలా కాలంగా అలాగే ఉంచబడిందని విచారణలో వెల్లడైంది. పూలమాలలు, స్మారక వస్తువులు నిర్లక్ష్యంగా పడేయబడటం వంటి దృశ్యాలు అంత్యక్రియల వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
కోర్టులో బాధిత కుటుంబ సభ్యులు తమ వేదనను వివరించారు. కొందరు తాము అందుకున్న బూడిద తమ కుటుంబ సభ్యులది కాదని తెలిసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు తాము తమ తల్లిదండ్రులు లేదా బంధువులకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించామని భావించినప్పటికీ, వారి మృతదేహాలు అసలు దహనం కాలేదని తెలుసుకోవడం జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. చాలామంది ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, తీవ్ర మానసిక ఒత్తిడి, అపరాధ భావన వెంటాడుతోందని కోర్టుకు తెలిపారు.
ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు రాబర్ట్ బుష్ చర్యలను "పారిశ్రామిక స్థాయిలో విశ్వాస ద్రోహం"గా అభివర్ణించారు. అత్యంత బాధలో ఉన్న కుటుంబాలు అతనిపై ఉంచిన నమ్మకాన్ని అతడు డబ్బు కోసం ఉపయోగించుకున్నాడని పేర్కొన్నారు. కుటుంబాలు అంత్యక్రియల కోసం చెల్లించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించడం, కొన్ని సందర్భాల్లో దహనం జరగకపోయినా జరిగిందని చెప్పి తప్పుడు బూడిదను ఇవ్వడం వంటి చర్యలు అతని నేరాల తీవ్రతను మరింత పెంచాయని కోర్టు విన్నది.
విచారణ సందర్భంగా రాబర్ట్ బుష్ కోర్టుకు వచ్చినప్పుడు బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పినప్పటికీ, చాలా మంది ఆ క్షమాపణను తిరస్కరించారు. "ఇప్పుడైనా క్షమించమంటే ఎలా క్షమిస్తాం? మా జీవితాల్లో జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు?" అని పలువురు ప్రశ్నించారు. కొందరు అతడు జీవితాంతం తన చేసిన పనుల భారాన్ని మోసుకోవాలని, కఠిన శిక్ష పడాలని కోరారు.
ఈ ఘటనతో బ్రిటన్‌లో అంత్యక్రియల రంగంపై నియంత్రణలు కఠినతరం చేయాలన్న డిమాండ్ బలపడింది.
బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన మాజీ అంత్యక్రియల నిర్వాహకుడు రాబర్ట్ బుష్ కేసులో శిక్ష ఖరారు ప్రక్రియ ప్రారంభం కావడంతో బాధిత కుటుంబాల ఆవేదన, ఆగ్రహం మరోసారి వెలుగులోకి వచ్చింది. తమ ప్రియమైన వారిని గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలుకుతున్నామని భావించిన కుటుంబాలు, వాస్తవానికి వారి మృతదేహాలు ఖననం లేదా దహనం చేయకుండా నెలల తరబడి అలాగే ఉంచారని తెలుసుకుని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాయి. కోర్టులో తమ అనుభవాలను వెల్లడించిన కుటుంబ సభ్యులు రాబర్ట్ బుష్ చర్యలను "భయానక దృశ్యం"గా అభివర్ణిస్తూ, అతని వల్ల జీవితాంతం మరచిపోలేని గాయాలు మిగిలిపోయాయని తెలిపారు.
ఇంగ్లాండ్‌లోని హల్ నగరంలో లెగసీ ఇండిపెండెంట్ ఫ్యూనరల్ డైరెక్టర్స్ సంస్థను నిర్వహించిన రాబర్ట్ బుష్, మరణించిన వారి కుటుంబాల విశ్వాసాన్ని దారుణంగా దుర్వినియోగం చేశాడని అభియోగాలు నిరూపితమయ్యాయి. ఆయన మొత్తం 67 నేరాలను అంగీకరించాడు. వీటిలో 30 మంది మృతదేహాలకు చట్టబద్ధమైన ఖననం లేదా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం, కుటుంబాలను మోసం చేయడం, తప్పు బూడిదను అందించడం, అంత్యక్రియల కోసం చెల్లించిన డబ్బును దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి
.Fetching videos...
Fetching latest news...
No trending news