రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల భాగంగా రంగంపేట గ్రామంలో ప్రధాన రహదారి సీసీ రోడుగా రూపుదిద్దుకుంది. అనంతపురం – తగరకుంట ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే మార్గాన్ని సుమారు 70 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డుగా నిర్మించి అధికారులతో కలిసి ప్రారంభించారు.
గ్రామాభివృద్ధి దిశగా హంద్రీనీవా – పీఏబీఆర్ కాలువల ద్వారా గ్రామ చెరువుకు నీరు అందించడం ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో బంగారు పంటలు పండించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గత 2014–2019 కాలంలో కూడా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
రంగంపేట చెరువుకు సుమారు ఒక కోటి రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టడం ద్వారా చెరువు సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెరువు కట్ట క్రింద సిమెంట్ కాంక్రీట్ వాల్ నిర్మాణం చేసి రహదారి సౌకర్యం కల్పించారు.
అలాగే గ్రామ స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో అక్కడికి సిమెంట్ రోడ్డు, కాలువలు, కల్వర్టులు ఏర్పాటు చేసి సౌకర్యం కల్పించారు. అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి విద్యా సంబంధిత మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేశారు.
అనంతపురం – తగరకుంట ప్రధాన రహదారి నుంచి మాధవరాజుల స్వామి దేవాలయం వరకు సుమారు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. బీసీ, ఎస్సీ కాలనీలతో పాటు గ్రామంలోని అన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు.
బీసీ, ఎస్సీ కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సమస్యలను తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news