ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భూర్ల రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు సమావేశాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ పాల్గొని 12 క్లస్టర్లలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
క్లస్టర్ వారీగా నిర్వహించిన ఈ సమావేశాల్లో కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మంచినీరు, భోజన సదుపాయాలు, టీ, స్నాక్స్, ఏసీ, కూలర్ వంటి అన్ని వసతులు కల్పించి కార్యక్రమాన్ని సౌకర్యవంతంగా నిర్వహించినట్లు వివరించారు. టిడిపి కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు ప్రజల పండుగ వాతావరణంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని “పసుపు సైనికుల పండుగ”గా అభివర్ణించారు. తెలుగుజాతి కీర్తి, ప్రగతి, సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే మహోత్సవమే మహానాడు అని ఆయన అన్నారు. అధినేత ఆదేశాల మేరకు క్లస్టర్ స్థాయిలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి దిశానిర్దేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకత్వాన్ని శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ అభినందించారు. “కార్యకర్తే అధినేత” అనే భావనతో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలనే సిద్ధాంతాన్ని ఆయన గుర్తు చేశారు.
మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, పోలింగ్ బూత్ కన్వీనర్లు సహా ప్రతి స్థాయి నాయకత్వం మహానాడు విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో మరింత బలంగా చేరేలా సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మొత్తానికి ప్రత్తిపాడు వర్చువల్ మహానాడు సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, టిడిపి బలోపేతానికి దోహదపడుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news