ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాలలో ఘనంగా నిర్వహించబడింది.
చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు, వాటికి తక్షణ పరిష్కారం చూపేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పి-ఫోర్ సిబ్బంది నాయకులు స్వీకరించారు. మొత్తం 21కు పైగా అర్జీలు నమోదు అయ్యాయి. వీటిలో ఇంటి నిర్మాణాలు, స్థలాల సమస్యలకు సంబంధించినవి 5, పింఛన్లకు సంబంధించినవి 10, ఇతర వివిధ సమస్యలకు సంబంధించినవి 6 అర్జీలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి అవసరాలు, సమస్యలను తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలనే సంకల్పాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రజల నుంచి కూడా దీనికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగేంద్రమణి, వల్లెపు వేణు, జనసేన పార్టీ వీర మహిళ, ఏఎంసీ డైరెక్టర్ కారంపూడి పద్మిని, చీరాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు దేవరకొండ స్వాతి, బీసీ నాయకురాలు నాగలక్ష్మి, అలాగే కూటమి నాయకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news