బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐఏఎస్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్, డ్రైనేజీ, రహదారి మరియు భూ సంబంధిత సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు.
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నందున కింది స్థాయి అధికారులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కార చర్యలు చేపట్టారు. గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Fetching videos...
Fetching latest news...
No trending news