పెట్రోల్, డీజిల్ ధరలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో పాటు రిటైల్ ఇంధన ధరలు గత నాలుగేళ్లుగా స్థిరంగా ఉండటంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. అందువల్ల ధరల సవరణను పూర్తిగా తోసిపుచ్చలేమని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే కమర్షియల్ గ్యాస్, ఇండస్ట్రియల్ గ్యాస్, 5 కిలోల LPG సిలిండర్లు మరియు జెట్ ఫ్యుయల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంధన రంగంలో మరోసారి ధరల సవరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు, దిగుమతి వ్యయాల పెరుగుదల దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సాధారణ వినియోగదారులపై భారం పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news