ప్రధాని నరేంద్ర మోదీపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చి ఆరోగ్యం గురించి వ్యక్తిగతంగా పరామర్శించిన ప్రధానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా కొనిదెల, పిల్లలతో కలిసి స్వాగతం పలికారు. శస్త్రచికిత్స అనంతరం ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి తెలుసుకున్న విషయాన్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు.
“ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూసే నాయకుడు మోదీ” అంటూ ప్రధాని వ్యక్తిత్వాన్ని పవన్ కొనియాడారు. దేశ బాధ్యతలతో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వచ్చి పరామర్శించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.
ప్రధాని ప్రేమ, ఆప్యాయత, మార్గదర్శనం ఎప్పటికీ ప్రత్యేకమే అని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news