ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా టిడిపి కార్యాలయం కోసం స్థల మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.
ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్లోని ఏసీబీ కార్యాలయం సమీపంలో కేటాయించిన స్థలాన్ని ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలంలో ఉన్న చెట్లను క్రేన్ సహాయంతో తొలగించే పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం పార్టీ కార్యాలయ నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో స్థానికంగా రాజకీయంగా ఈ అభివృద్ధి కీలకంగా మారింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ సభ్యులు, షేక్ ఆరీఫా, బీరం అరుణ రెడ్డి, గార్లపాటి శ్రీనివాసరావు, కసుకుర్తి అంకరాజు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news