ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఫోకస్ బూత్లు 82, 83 పరిధిలోని ఈ కుటుంబాల చేరికతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సూచనల మేరకు ఈ చేరిక కార్యక్రమం నిర్వహించబడింది. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండేటి ఉదయ్ కిరణ్, గ్రామ పార్టీ అధ్యక్షులు గార్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు దేవినేని డెలారామ్ పసుపు కండువా కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు.
ఫోకస్ బూత్ అబ్జర్వర్ శేషపు శేషగిరిరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం సజావుగా కొనసాగింది. పార్టీలో చేరిన కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈ చేరికతో ముసునూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రెసిడెంట్ దేవినేని శ్రీధర్, నక్క యోహాను, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news