నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ములుమూడి గ్రామంలో సుమారు రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ములుమూడి గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.6 కోట్ల 18 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ మండలంలో ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు పరిమితం కావాలని, ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా కేంద్రిత పాలనను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషిని కూడా ఆయన ప్రశంసించారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, జెడ్పీ కోప్షన్ మెంబర్ అల్లాబక్షు, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్ సహా అనేక మంది ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Fetching videos...
Fetching latest news...
No trending news