13వ డివిజన్ పరిధిలో జరిగిన ఈ శిబిరంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
గత 39 రోజులుగా కొనసాగుతున్న ‘నేత్రజ్యోతి’ కార్యక్రమంలో ఇప్పటివరకు 5,142 మందికి కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో 3,000 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించగా, ఇప్పటికే 2,846 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. తీవ్ర కంటి సమస్యలు ఉన్న 74 మందికి నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
అదేవిధంగా ‘దంత సురక్ష’ కార్యక్రమం ద్వారా 2,300 మందికి పైగా ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడ్డాయి. పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మంత్రి నారాయణ ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశారని అధికారులు తెలిపారు. అవసరమైన వారికి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించడం ద్వారా వైద్య సేవలను మరింత సులభతరం చేశారు.
యలమవారిదిన్నె ప్రాంత ప్రజలు ఈ ఆరోగ్య శిబిరాలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ముంగిటకే తీసుకురావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని డివిజన్ ప్రెసిడెంట్ కాయల తిరుపతి, క్లస్టర్ ఇంచార్జి ఊటుకూరు చంద్ర, డివిజన్ కోఆర్డినేటర్ తిరుపతి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో AGM శేఖర్ రెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధ, మాధురి, దంత వైద్య నిపుణులు డాక్టర్ షేక్ రఫీ, డాక్టర్ శ్రావ్య శ్రీ, స్థానిక టీడీపీ యూనిట్ ఇంచార్జి నర్రా భువనేశ్వరి, బి.ఎల్.సి మోహన్ రావు, నావులూరు శ్రీకృష్ణ, బి.వి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మొత్తంగా చూస్తే నెల్లూరులో కొనసాగుతున్న ఈ ఆరోగ్య శిబిరాలు ప్రజల ముంగిటకే నాణ్యమైన వైద్యాన్ని తీసుకెళ్తూ “ఆరోగ్య యజ్ఞం”గా నిలుస్తున్నాయి.

Fetching videos...
Fetching latest news...
No trending news