విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాలో అధికారిక పర్యటన ప్రారంభించారు. ఆయన మాస్కో చేరుకోగా భారత రాయబార కార్యాలయ ఉపముఖ్యుడు నిఖిలేశ్ గిరి, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు.
జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మంత్రి నారా లోకేష్ రష్యాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.
ఈ పర్యటనలో విద్య, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, సహకారం, సాంకేతిక అభివృద్ధి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే అంతర్జాతీయ పారిశ్రామిక వేదికల్లో ఆంధ్రప్రదేశ్ అవకాశాలను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
మంత్రికి రష్యాలోని ప్రవాసాంధ్రులు కూడా స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పర్యటన రాష్ట్ర ఐటీ, విద్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news