వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
మంత్రి దంపతులు గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ మంత్రి దంపతులకు పూర్ణ వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ ఈవో, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news