కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని UDF కూటమి సంచలన విజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో 100కు పైగా సీట్లను గెలుచుకుని మెజార్టీ మార్క్ దాటి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఈ ఫలితంతో అధికార LDF కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుత సీఎం విజయన్ నేతృత్వంలోని LDF కూటమికి ఈ ఫలితాలు పెద్ద షాక్‌గా మారాయి. రాష్ట్ర ప్రజలు మార్పుకు మొగ్గుచూపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విజయంలో పూతుపల్లి నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దివంగత మాజీ సీఎం ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించారు. LDF అభ్యర్థి కేఎం రాధాకృష్ణన్‌పై ఆయన 52,907 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు.
విజయం అనంతరం చాందీ ఊమెన్ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్నా.. మనమే గెలిచాం” అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ తన తండ్రి సమాధి వద్ద నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ కూటమి విజయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. UDF తిరిగి అధికారంలోకి రావడంతో కేరళ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తానికి కేరళలో UDF కూటమి సాధించిన ఈ భారీ విజయం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రక మలుపుగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news