ప్రపంచ కార్మిక దినోత్సవం “మే డే” సందర్భంగా కడప నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొని వారికి మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్మికుల కృషిని ప్రశంసిస్తూ నగర పరిశుభ్రతలో వారి సేవలు అత్యంత కీలకమని నేతలు పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మున్సిపల్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు రక్షణ టోపీలు మరియు వాటర్ బాటిళ్లు అందజేశారు. కష్టపడే కార్మికులకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
మున్సిపల్ కార్మికులు నగర అభివృద్ధి, పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని నేతలు కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news