బాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ జియా ఖాన్ జీవితం విషాదాంతంగా ముగిసింది. అమెరికాలో జన్మించి, లండన్‌లో పెరిగిన జియా చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపించింది. 2007లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటుడితో కలిసి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ నామినేషన్ కూడా వచ్చింది.
తర్వాత అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్’, ఆమిర్ ఖాన్ నటించిన ‘గజినీ’ వంటి భారీ విజయాల్లో భాగమై తక్కువ సమయంలోనే గుర్తింపు పొందింది. వరుస విజయాలతో 18 ఏళ్లకే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న జియా ఖాన్ భవిష్యత్తులో బాలీవుడ్లో టాప్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.
కానీ ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2013 జూన్ 3న ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యావత్ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ముగియడం ఇప్పటికీ బాలీవుడ్లో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు, కేసులు, చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్పష్ట
Fetching videos...
Fetching latest news...
No trending news