మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ ప్రస్తుతం VFX పనులతో బిజీగా ఉంది. దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్‌గా గ్రాండ్‌గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే వచ్చిన VFX అవుట్‌పుట్‌ను మేకర్స్ సంతృప్తిగా ఉన్నారని, చిరంజీవి కూడా కొన్ని భాగాలకు ఓకే చెప్పినట్లు సమాచారం.
అయితే మరింత బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచనలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఆయన దగ్గరుండి VFX సూపర్విజన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. భారీ విజువల్ సినిమాల విషయంలో చిన్న తప్పు జరిగినా సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
గతంలో ‘ఆదిపురుష్’, ‘ఆచార్య’ వంటి సినిమాలు అలాగే ఇటీవల ‘రాజా సాబ్’ కూడా VFX విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాంటి తప్పులు ‘విశ్వంభర’లో జరగకుండా ఉండేందుకు టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటోంది. ఇక రీ-రికార్డింగ్ కోసం ‘హనుమాన్’ ఫేమ్ గౌర హరిను తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా విజువల్‌గా కొత్త స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news