జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశ గ్రామానికి చెందిన విద్యార్థి పాలవలస భార్గవ నాయుడు ప్రతిభ చాటాడు. ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో 45వ ర్యాంక్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.
భార్గవ నాయుడు చిన్ననాటి నుంచే విద్యలో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు రాజాంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. తరువాత 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు వైజాగ్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. క్రమశిక్షణతో పాటు కఠిన శ్రమతో ఈ స్థాయి విజయాన్ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భార్గవ నాయుడు తండ్రి పాలవలస అప్పల రాము వంగర మండలం అరసాడ హైస్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తండ్రి మార్గదర్శకత్వం, తల్లి ప్రోత్సాహం అతని విజయానికి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ ఫలితంతో భార్గవ నాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు వంగర మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అతని కృషి మరింత ఉన్నత స్థాయికి చేరాలని అభినందనలు తెలిపారు.
జేఈఈ అడ్వాన్స్‌లో సాధించిన ఈ ర్యాంక్ అతని భవిష్యత్తు విద్యా ప్రయాణానికి మంచి పునాది అవుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news