బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా దోగిపర్తి బాలకృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు డూండి రాకేష్, రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.
ఈ నియామక పత్రాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మామిడిపాక హరి ప్రసాద్ చీరాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద అధికారికంగా అందజేశారు. బాపట్ల జిల్లా ఫెడరేషన్ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఐక్యంగా ఉండాలని, అన్ని రంగాల్లో సమాజ సభ్యులు అభివృద్ధి చెందాలని సూచించారు. అలాగే బాపట్ల జిల్లాను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తుందని తెలిపారు.
కొత్తగా నియమితులైన అధ్యక్షుడు దోగిపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజంలోని ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తానని, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి గజబలి సాయి, కోశాధికారి కోళ్లపూడి శివన్నారాయణ, తమ్మన పవన్ కుమార్, ఉపాధ్యక్షులు పోతుగంటి రామాంజనేయులు, నూతికట్టు పూర్ణచందర్రావు, జాయింట్ సెక్రటరీ దోగిపర్తి వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ గొంట్ల కోమలి, యూత్ అధ్యక్షులు పోతుల ప్రకాష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news