గుజరాత్లోని బరోడా మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యేక పాఠాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. సోషియాలజీ విద్యార్థుల కోసం రూపొందించిన “సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం” కోర్సులో ఈ అంశాన్ని చేర్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
ఈ కోర్సులో “మోదీతత్వం” పేరుతో ఒక ప్రత్యేక పాఠాన్ని పొందుపరిచారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ శైలి, ఆయన విధానాలు, సమాజంపై వాటి ప్రభావం వంటి అంశాలను విద్యార్థులకు వివరించనున్నారు.
అదేవిధంగా చరిత్రలో ప్రముఖులైన ఛత్రపతి శివాజీ మహారాజ్, సాయాజీ గైక్వాడ్ వంటి నాయకుల కృషి, వారి రచనలు, పాలనా విధానాలను కూడా ఈ కోర్సులో భాగంగా బోధించనున్నారు.
విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు సమాజ శాస్త్రపరమైన దృష్టితో నాయకత్వాన్ని అర్థం చేసుకునేలా ఈ కోర్సును రూపొందించినట్లు వర్సిటీ పేర్కొంది.
మొత్తంగా గుజరాత్ వర్సిటీలో ప్రవేశపెట్టిన ఈ కొత్త కోర్సు విద్యారంగంలో చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news