గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. నూతనంగా మంజూరైన పింఛన్లతో పాటు వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం గొప్ప ఆలోచనలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడంతో పాటు వితంతు పింఛన్ల ప్రక్రియను సులభతరం చేశారని ఆయన పేర్కొన్నారు.
కార్యాలయాల్లో కూర్చొని కాకుండా ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన అన్నారు.
పింఛన్ అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. “మంచివాడు మా రాము” అంటూ వృద్ధులు ఆయనతో సెల్ఫీలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ సింహాద్రి, రావి వెంకటేశ్వరరావు, గోర్జి సత్యనారాయణ, పండ్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, బీజేపీ నేత అంగడాల సతీష్, రామ్ దేని వేణు, కుందేటి ప్రసాద్, నాగేశ్వరరావు, లోకల్ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news