పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో చిట్వేల్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృక్పథంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం “ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉంటా” అన్న మాటను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నిధుల మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ కేకే చౌదరి ప్రత్యేక సిఫారసు చేశారని తెలిపారు. ఆయన చొరవతోనే నిధులు త్వరితగతిన మంజూరైనట్లు వెల్లడించారు.
చిట్వేల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు బాధితులు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం పొందారు. మద్దిన ప్రమీలమ్మ (చిట్వేల్), కస్తూరి మునీశ్వర (కస్తూరివారిపల్లి), బుంగటావుల రాధమ్మ (రెడ్డివారిపల్లి), గోసల ఇందిరమ్మ (రెడ్డివారిపల్లి), తుంగా శ్రీదేవి (తుమ్మచెట్లపల్లి) లబ్ధిదారులుగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ నాయకులు మరియు ఎన్డీఏ కూటమి అనుబంధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news