ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.
అలాగే ఈ-బస్సుల ప్రవేశం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష జరగనుంది. రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news