కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో “లేబర్ అడ్డాలు” ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తొలివిడతలో రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 15 చోట్ల ఈ లేబర్ అడ్డాల నిర్మాణం చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అత్యుత్తమ సేవలు అందించిన కార్మికులకు, ఉత్తమ యాజమాన్యాలకు “శ్రమశక్తి పురస్కారాలు” అందజేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
లేబర్ అడ్డాలను కేవలం పని కల్పన కేంద్రాలుగానే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. పని లేని రోజుల్లో కూడా కార్మికులు ఈ కేంద్రాల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
అత్యాధునిక పనిముట్లతో కూడిన ఈ కేంద్రాలు కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడతాయని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల భద్రత, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news