చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సంఘటనను కొందరు కావాలనే పెద్దదిగా చూపించారని వారు అన్నారు.
ఒకరికొకరు ఊర్లో లేని సమయంలో జరిగిన చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని తెలిపారు. వ్యక్తిగత విభేదాలు తమకు లేవని, రాజకీయంగా కూడా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
పార్లమెంట్, అసెంబ్లీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా కలుస్తున్నామని చెప్పారు. తాము మాటలకే పరిమితం అయ్యే రకం కాదని, పనుల ద్వారానే ప్రజలకు సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
గన్ మెన్ సరెండర్ అంశం ప్రభుత్వంపై కోపం కాదని, అది కేవలం ఆవేదన మాత్రమేనని తెలిపారు. పార్టీ తమకు తల్లిలాంటిదని, దానికి ఎప్పుడూ విధేయులుగానే ఉంటామని చెప్పారు.
అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ లక్ష్యమని, అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news