చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని అవ్వలు, తాతలు, వికలాంగులకు ఇంటింటికే వెళ్లి పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాలలో కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల పింఛన్లను సకాలంలో పంపిణీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అగరాల పంచాయతీలో పింఛన్ల పంపిణీతో పాటు స్థానిక సమస్యలను కూడా ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేశారు.
చంద్రగిరి మండలంలో 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేయడానికి అధికారులు, కూటమి నాయకులు కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే ప్రభుత్వం కూటమిదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news