ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. పర్యావరణహిత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ ఈ-సైకిళ్లపై ప్రచారం చేయాలని చెప్పారు. “నేను కూడా సైకిల్‌పై ప్రచారం చేస్తా” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ద్వారా మరింత విశ్వాసం పెంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తం పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news