బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షకు శ్రీకారం.. సామాన్యులకు భారీ ఛాన్స్
Updated 4 days ago
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తన పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన ప్రోమోతో బిగ్ బాస్ 10పై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి “దశావతారం” కాన్సెప్ట్‌తో సీజన్‌ను మరింత వైవిధ్యంగా తీసుకురాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
అంతేకాకుండా గత సీజన్లో మంచి ఆదరణ పొందిన “అగ్నిపరీక్ష” కాన్సెప్ట్‌ను మరోసారి తీసుకురానున్నారు. “బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష” పేరుతో సామాన్య ప్రజలకు నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. తమ ప్రతిభ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగల ఎవరైనా ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు.
ఆడిషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు బిగ్ బాస్ ఆడిషన్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసి, ప్రత్యేక వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గత సీజన్లలో కూడా ఇదే విధానాన్ని అనుసరించి సామాన్యుల ఎంపిక జరిగింది.
ఈసారి కూడా కామనర్స్‌కు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. గత సీజన్లో సామాన్యుల విభాగం నుంచి వచ్చిన పోటీదారులు మంచి గుర్తింపు పొందడంతో, పదో సీజన్లోనూ అదే ఫార్మాట్‌ను మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ అభిమానుల్లో ఇప్పటికే అగ్నిపరీక్ష ఆడిషన్స్, కంటెస్టెంట్ల ఎంపిక, దశావతారం కాన్సెప్ట్‌పై భారీ చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ 10 కేవలం మరో సీజన్ మాత్రమే కాదు.. షో చరిత్రలో మైలురాయి సీజన్‌గా నిలవబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఈసారి టాస్కులు, హౌస్ డిజైన్, కంటెస్టెంట్ల ఎంపిక, కాన్సెప్ట్ అన్నింటిలోనూ ప్రత్యేకత ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.