అమరావతిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, కడప డీసీసీబీ చైర్మన్ ఎం. సూర్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా నేతలు బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధిలో ఆయన పాత్ర మరింత కీలకంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, కార్యకర్తలకు ఇది ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. నాయకులు కలిసి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
మొత్తంగా ఈ భేటీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news