కొండాపురం మండలం కొమ్మి గ్రామ హరిజనవాడలో శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించనున్న సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ఠ కార్యక్రమానికి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ రూ.15 వేల విరాళాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రినాయుడు, ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్, సింధు ప్రియలను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రినాయుడు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని సీతాలమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని కోరుతూ ట్రస్ట్ తరఫున రూ.15 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news