కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం, లారీ ఓ ఆటోను క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా ఉన్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు మరియు గాయపడిన వారు స్థానిక కెమిలయిడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news