తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో పూర్తయింది. అనంతరం మూడు రోజుల పాటు ఫలితాలను క్రోడీకరించే ప్రక్రియ కొనసాగనుంది. ఒకే సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థుల ఆన్సర్ షీట్లను బోర్డు ర్యాండమ్‌గా మరోసారి పరిశీలించనుంది.
కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేయడానికి 8, 10, 12 తేదీలను ప్రతిపాదించినప్పటికీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు 8వ తేదీ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 12న విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news