ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని APSDMA వెల్లడించింది. రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగవచ్చని తెలిపింది.
వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైతులు, పశువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మొత్తానికి ఏపీలో రానున్న రోజుల్లో వర్షాలు, ఎండ కలగలిపిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని APSDMA హెచ్చరిక జారీ చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news